27-11-2025 12:08:08 AM
నిజామాబాద్, నవంబర్ 26 :(విజయ క్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
’భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరు లందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన - వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తాడ్వాయి లో..
తాడ్వాయి, నవంబర్, 26( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశ పౌరుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్న భారతదేశంలో అందరు కలిసిమెలిసి ఉండేలా, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు 1950 నుంచి నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాల ఆధారంగా సుస్థిర పాలనను కొనసాగిస్తూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యూసుఫ్ హుస్సేన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
బార్ సమావేశపు హల్‌లో..
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, నవంబర్ 26 (విజయ క్రాంతి): భారత ప్రజల కోసం, భారత ప్రజలు రాసుకున్న గ్రంధమే భారత రాజ్యాంగమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు.జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్,సహచర న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, భాస్కర్ రావు, గంగా ప్రసాద్, మధుసుధన్ రావు, భాస్కర్ పరుచూరి శ్రీధర్ తదితరులతో కలిసి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు.
బ్రిటిష్ వలస పాలన అనంతరం విశాల భారతావనిని పరిపాలించడానికి రాజ్యాంగ అవసరం ఏర్పడిందని తెలిపారు. 1950,జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిం దని అన్నారు. భారతరాజ్యాంగం భారత ప్రజల ఆత్మ అని, అది ప్రజలను జీవన ప్రమాణాలను నిర్ణస్తుందని అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేం దర్ రెడ్డి మాట్లాడుతు ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశం తనకుతానుగా సమర్పిం చుకున్న రోజే ప్రజలకు సర్వహక్కులు లభించాయని తెలిపారు. దేశ పార్లమెంట్ కు ప్రజాప్రతినిధులను, రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకునే పార్లమెంటరీ సంప్రదాయం నిర్మించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు రాజ్యాంగ ఫలాలు ప్రగతి పథకాల రూపంలో ప్రజల వద్దకు చేరుతున్నాయని విశదీకరించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. విద్యార్థులు విద్య విషయాలతో పాటు రాజ్యాంగపు విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు.న్యాయవాదులు భాస్కర్, శ్రీధర్, ఆశ నారాయణ లు మాట్లాడుతు రాజ్యాంగమనే సౌధపు నీడలో ప్రతి పౌరుడు సరక్షితంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాబురావు,యునస్ ఖాన్ వినాయక్, రత్నాకర్ రెడ్డి, మద్దెపల్లి శంకర్, ఇంతియాజ్,జూనైద్ అలీ, జైపాల్, నారాయణ పాల్గొన్నారు.
విద్యార్థులు రాజ్యoగాన్ని గౌరవించాలి
ఆర్మూర్ నవంబర్ 26: (విజయ క్రాంతి): విద్యార్థులు రాజ్యoగాన్ని గౌరవించాలని శాoభవి విద్య సంస్థ పాఠశాల చైర్మన్ మధుసూదన్ రాజు అన్నారు.బుధవారం నిజామాబాదు జిల్లా బాల్కొండ లొ జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులతో అన్నారు. బ్రిటిష్ పాలకుల వల్ల దేశానికి స్వతంత్రం వచ్చిందని భారత దేశానికి డా, బి. ఆర్. అంబేద్కర్ ప్రముఖులు పెద్దలతో భారత రాజ్యాంగాన్ని రూపొం దించారని విద్యార్ధి దశలోనే విద్యార్థిని విద్యార్థులు రాజ్యoగాన్ని గౌరవించాలని మధుసూదన్ రాజు అన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులతో కరెస్పాండంట్ రవీన్ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం సామూహికంగా ‘రాజ్యాంగం పట్ల విశ్వాసం... సౌ భ్రాతృత్వం, సమా నత్వంతో కలిగి ఉంటామని రాజ్యాంగ నియమా లను పాటిస్తూ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.