27-11-2025 12:06:03 AM
మేడ్చల్ అర్బన్ నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను రాష్ట్ర రజక సంఘం నాయకులు పంజగారి ఆంజనేయులు, కొన్నే సంపత్ రజకలు రజకుల సమస్యలపై కలిసినట్లు తెలిపారు.
ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు రజక వృత్తిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి జీరో బిల్లులు వచ్చే విధంగా చూడాలని మంత్రి కోరినట్లు వారు తెలిపారు.
విద్యుత్ బిల్లుల సమస్యలపై మంత్రి స్పందించి ట్రాన్స్కో ఎండికి ఫోన్ లో మాట్లాడి రజక వృత్తి చేసుకునే వారిని బిల్లులు కట్టాలని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారని పంజగారి ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద లాల్ రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.