calender_icon.png 12 May, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీజీ కోరుకున్న దేశం కావాలి

05-03-2025 01:04:21 AM

నడుస్తున్నది కార్పొరేట్ రాజ్యం

  1. భారత్ ఉత్పత్తిదారుల దేశంగా ఉండాలి 
  2. పెట్టుబడిదారుల దేశంగా కాదు
  3. చిన్న మధ్యతరగతి ప్రజలపై భారీగా పన్నుల భారం పడుతోంది
  4. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికి ప్రశ్నించే హక్కుంది
  5. ప్రజాఉద్యమాల జాతీయ వేదిక సభలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి) : భారతదేశం ఉత్పత్తిదారుల దేశంగా ఉండాల ని, పెట్టుబడిదారుల దేశంగా కాదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. మహాత్మాగాంధీ కోరుకున్నట్లుగా దేశం ఉండాలని, కానీ ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ రాజ్యం నడుస్తోందని ఆమె విమర్శించారు.

మార్చి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30వ వార్షికోత్సవ సభలలో భాగంగా మంగళవారం ‘రాజ్యాంగం, ప్రజా స్వామ్య పరిరక్షణలో పార్టీల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. అంతకుముందు ఆమె రాట్నంపై నూలు వడికారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో చిన్న మధ్యతరగతి ప్రజలపై భారీగా పన్నుల భారం పడుతోందన్నారు. అంబానీ, అదానీలతో పాటు పేదలు కూడా పాలప్యాకెట్ నుంచి ఇతర వస్తువులపై ఒకేలా పన్నులు కడుతున్నారన్నారు.

భారత్‌ను ఉత్పత్తిదారుల దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుం దన్నారు. గాంధీజీ సూత్రం ప్రకారం పార్టీలు, ప్రభుత్వాలు అంత్యోదయం కోసం పనిచేయాలన్నారు. 

ప్రశ్నించే హక్కు ఉంది.. 

ప్రజాస్వామ్యంలో సమస్యలపై ప్రతిఒక్కరికీ ప్రశ్నిం చే హక్కు ఉందని మీనాక్షి నటరాజన్ అన్నారు. అందుకోసం ప్రత్యేక అనుమతి అవసరం లేదని చెప్పారు. సోమవారం మూసీ పరివాహక ప్రాంత పర్యటనకు వెళ్లిన సామాజికవేత్త మేధా పాట్కర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజా ఉద్యమాలు చే  సామాన్య బడుగు బలహీనవర్గాల తరుపున మాట్లాడుతున్నారన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య రక్షణకు, ప్రజల తరుపున పనిచేయాలని సూచించారు. విద్యార్థిగా ఉన్నపుడు మేధాపాట్కర్ లాంటి వారిని చూసే తాను స్ఫూర్తి పొంది ప్రజా ఉద్యమాలు, రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను సర్వోదయ కార్యకర్తగా పనిచేశానని చెప్పారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు రాజులగా వ్యవహరిం  చెప్పారు. దేశంలో చాలా నిర్ణయాలు ప్రజలకు, పర్యావరణ నికి వ్యతి  జరుగుతున్నాయని, దీనిపై ప్రభు త్వాలు, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. 

రాజకీయ వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉంది: కోదండరాం

ప్రస్తుత రాజకీయ వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉందని, దీంతో ప్రజాసమస్యలు ముందుకు రావడంలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నా రు. ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారుల ఎజెండాపైనే పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాల పాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

సీపీఎం పోలిట్ బ్యూరోసభ్యుడు అశోక్ ధావలే, సీపీఐ నేత అలీరాజాలు లైవ్ వీడియోద్వారా సందేశమిచ్చారు. కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో దేశంలో రెండుసార్లు భారీ ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రజా ఉద్యమాల నుంచి తాము చాలా నేర్చుకుంటామని, ప్రజా ఉద్యమాల నాయకులకు ఉన్న ధైర్యం తమకు స్ఫూర్తి అని సమాజ్‌వాదీ ఎంపీ జావేద్ అలీ అన్నారు.

తెలంగాణలో ప్రజా ఉద్యమాల తరపున సామాజిక ఉద్యమకారుడు కిరణ్ విస్సా మాట్లాడుతూ, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను ఇచ్చిందని, కానీ నిరసనలు తెలిపేందుకు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో మతతత్వాన్ని నిలువరించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. 

ప్రజల యూనిటీ కావాలి: మేధాపాట్కర్

అన్యాయానికి గురయ్యే వారు, వివక్షను ఎదుర్కొనే వారి కోసం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(ఎన్‌ఏపీఎం) మూడు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తోందని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ అన్నారు. దేశంలో ప్రజల మధ్య ఐకమత్యం రావాలంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో రాదని, ప్రజల మధ్య యూనిటీ కావాలన్నారు.

దేశవ్యాప్తంగా 200 ప్రజా   22 రాష్ట్రాలకు చెందిన వారు ఎన్‌ఏపీఎం సభలకు విచ్చేసినట్లు చెప్పారు. కా  కర్షకులు, ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులు, తదితరుల వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టినట్లు చప్పారు. ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం కావాలన్నారు. మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే మూసీ ప్రాజెక్టులో ప్రజల అభిప్రాయాలతో ముందుకు సాగాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని తాను సందర్శించానని, అక్కడ చాలామంది పేదలు నివాసముంటున్నారని పేర్కొన్నారు. వారి పట్ల  ప్రభుత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫార్మాసిటీ లాంటివి పర్యావరణ విధ్వంసకరమైనవన్నారు.