12-05-2025 10:55:09 PM
చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారగాని రాంబాబు. కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా కానిస్టేబుల్ రాంబాబు కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ ఐపిఎస్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాంబాబు కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఎస్పి తెలిపినారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు, పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమం నందు ఎఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, వెల్ఫేర్ ఆర్ యస్ ఐ సాయిరాం, కుటుంబ సభ్యులు కిరణ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.