calender_icon.png 22 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి మత్స్యకారుడు మృతి

12-05-2025 10:58:41 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): చెరువులో చేపల వేటకు వెళ్లి కాళ్లకు చుట్టుకొని నీట మునిగి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామంలో జరిగింది. చిన్నగూడూరు ఎస్సై ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. జయ్యారం గ్రామానికి చెందిన కొండం సైదులు (55) చేపల వేటకు వెళ్లి చెరువులో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకోగా దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో నాచు తట్టుకొని ఊపిరాడక నీట మునిగి చనిపోయాడన్నారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.