12-05-2025 10:52:54 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ అధికారులు సంయుక్తంగా ట్రైన్లలో గంజాయి రవాణాపై మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా కురవి గేట్ ట్రాక్ పక్కన చెట్ల పొదల్లో 60.7 కేజీల ఎండు గంజాయి గుర్తించినట్లు మానుకోట ఎక్సైజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ తనిఖీల్లో సిఐలు నాగేశ్వరరావు, నీరజ, ఎస్సైలు చంద్రశేఖర్, అశోక్, కిరీటి,సిబ్బంది శ్రీనివాస్, మధు,రాజు, శ్రీను, శేఖర్, ఇబ్రహీం, భవాని, నరసింహారావు, రవి, సుమన్ పాల్గొన్నారు.