calender_icon.png 28 October, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణితం అంటే భయం పోగొట్టాలి

28-10-2025 06:39:35 PM

సిద్దిపేట డీఈవో శ్రీనివాస్ రెడ్డి..

సిద్దిపేట క్రైమ్: గణితం పట్ల విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచాలని సిద్ధిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో "కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్" అంశంపై జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేగంగా ఆలోచించడానికి గణితం దోహదం చేస్తుందన్నారు. ముఖ్యంగా మేధో సంపత్తిని గణితం వికసింపజేస్తుందని, మెదడుకు పదును పెడుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్సు డైరెక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన సంపదకు గణితం పునాది వంటిదన్నారు. సులభంగా గణితం నేర్చుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. శిక్షణలో జిల్లాలోని వివిధ ప్రాంతాల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.