03-09-2025 07:42:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) ఆవిష్కరించారు. గ్రామ యువకులు ర్యాలీతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి యువత హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.