calender_icon.png 15 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ బోడుప్పల్‌కు సహకరించాలి

14-10-2025 12:00:00 AM

మేడిపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బోడుప్పల్  నగర పాలక సంస్థలో పలు చెత్త వేసే ప్రాంతములను గుర్తించి తక్షణమే చెత్త ను శుభ్రం చేయాలని, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్  కమీషనర్ శైలజ పారిశుధ్య అధికారులను, సిబ్బం దిని ఆదేశించడం జరిగినది.ఇట్టి ఆదేశములతో సోమవారం 7వ డివిజన్  శివాలయం రోడ్డులో ప్రత్యేక పారి శుధ్య కార్యక్రమంలో భాగముగా చెత్తను తొలగించారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ .. ఎవరైనా బహిరంగ ప్రదేశములలో చెత్త వేస్తే భారీ జరిమానా తో పాటు క్రిమినల్ చర్యలు మున్సిపల్ చట్టము ను అనుసరించి విధించబడునని హెచ్చరించారు. ప్రజలందరూ చెత్త ను స్వచ్ఛ వాహనములకు అందచేసి స్వచ్ఛ బోడుప్పల్ కు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమములో సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, సంగీత, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.