14-10-2025 12:00:00 AM
నిజామాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): అనేకమంది పోటీలో ఉన్నప్పటికిని అందరి మన్నలను పొంది పార్టీకి విధేయుడైన నేతకే డిసిసి అధ్యక్షుడిగా అధిష్టానం అవకాశం కల్పిస్తుందని జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్ కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ హర్షద్ తెలిపారు. సోమవారం నిజామాబాద్ కేంద్రంలోని ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎఐసిసి ఆదేశాల మేరకు సంస్థ గత పార్టీ ఎన్నికల పరిశీలకులుగా తాను జిల్లాకు రావడం జరిగిందని ఏఐసీసీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉండి సేవలందించి అందరి పన్ననలను పొందిన వారికే జిల్లా అధ్యక్ష స్థానం దక్కుతుందని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు సంస్థ గత పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తన జిల్లాకు విచ్చేసానని కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలంగాణలో రెండవసారి అధికారం లక్ష్యంగా పార్టీని పటిష్ట పరచడానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ సంఘటన్ పటిష్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయడం స్థానిక నేతలు ముఖ్య కార్యకర్తలు ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందన్నారు. స్థానికంగా అందరి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి అందజేస్తామని కనీస ఐదేళ్ల అనుభవం అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉండాలని అటువంటి వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి ఒక్కరితో సాంప్రదించిన తర్వాతే అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదని సామాజిక బాధ్యత కలిగిన సంస్థ అని కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యుల లాగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఐదేళ్లలో అన్ని పూర్తి చేస్తామని జిల్లా అధ్యక్ష నగర అధ్యక్ష కాంగ్రెస్ పదవులకు కచ్చితంగా పారదర్శకంగా ఎంపిక చేస్తామని ఆ ప్రక్రియను నిష్పక్షపాతంగా జరుపుతామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులైన కార్యకర్తలైన పార్టీకి అందరూ సమానమేనని కార్యకర్తలు అందరికీ సముచిత గౌరవం ఉంటుందని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ ఏనుగు రవీందర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్హాందన్ రైతు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, హుడా చైర్మన్ కేశవ వేణు జిల్లా సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తదితరులు హాజరయ్యారు.