14-10-2025 12:00:00 AM
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ యుగంధర్ గౌడ్
ముషీరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ వైఖరిని నిరసిస్తూ ఈనెల 23న చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని బీసీలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో రాచాల మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చి ఉంటే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. జేఏసీ నాయకులు వివి గౌడ్, గోటూరి రవీందర్, గూడుషా, దేవర శివ, ధర్మేంద్ర సాగర్, బత్తుల జితేందర్, రేనట్ల మల్లేష్, అస్కని రమేష్, యశ్వంత్ గౌడ్, నరేందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.