07-07-2025 12:25:19 AM
ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, జులై 6 (విజయ క్రాంతి) : విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి సూచించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్లో ఎన్ సీసీ క్యాడెట్ శిక్షణ పూర్తి చేసిన తర్వాత సైనిక అధికారులు పాఠశాల ఎన్ సీసీ విద్యార్థులకు ’సీ’ సర్టిఫికెట్లు ఇచ్చి రక్షణ సేవలలో చేరేలా ప్రోత్స హించారు. ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.