calender_icon.png 6 August, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరుకే గురుకులం..సమస్యలకు నిలయం

25-07-2025 12:00:00 AM

  1. అస్తవ్యస్తంగా గురుకుల నిర్వహణ మురుగు నీటితో దుర్గంధం 

కరస్ గుత్తి ఎస్టి బాలికల హాస్టల్ లో సమస్యల లొల్లి

నాగల్గిద్ద, జూలై 24  : సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం కరస్గుత్తిలో పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎస్టీ బాలికల గురుకులం సమస్యలకు  నిలయంగా మారింది. గురుకులం నిర్వాహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. తమ విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అస్తవ్యస్తంగా గురుకుల నిర్వహణ..

ఎస్పీ బాలికల గురుకుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల నుండి  సెప్టిక్ ట్యాంకు నిండి మరుగు నీరు ఆవరణలో పారడంతో దుర్వాసనతో విద్యార్థుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. అయినా ఇప్పటివరకు అధికారులు, నిర్వాహకులు  పట్టించుకునేవారు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకే కాకుండా గురుకులం చుట్టు ప్రక్కన ఉన్న పొలంలో పని చేసేవారికి కూడా దుర్వాసన తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. గురుకులంలో స్వచ్చత లేకుండా ఆపరిశుభ్రంగా మారింది.

గత 15  రోజుల నుండి సేప్టిక్ ట్యాంకు నిండి మురుగు నిరు బయటికి రావడంతో గురుకులం అంతా కంపుకోడుతుంది,  గురుకులం నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. గురుకులం చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి ఈగలు దోమలతో స్త్వ్రర విహారం చేస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో నీరు నిలిచిపోయి దోమలు దాడి చేస్తే మలేరియా డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా బాత్రూం నీరు వంటగదిలోకి పడుతుండడంతో తీవ్ర దుర్గంధం మధ్యనే వంటలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు.

మంచినీటి కటకట...

గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహంలో సుమారు 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరందరికీ సరిపడే మరుగుదొడ్లు లేకపోవడంతో పాటు బోర్ మోటార్ చెడిపోవడంతో నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తే తప్ప స్నానాలు చేయడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలుంటుంది. మొదటి అంతస్తులు ఉండే విద్యార్థులు బకెట్ల ద్వారా నీటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది.

బోరు మోటర్ చెడిపోయి రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా గురుకులంలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం లైబ్రేరియన్ గా ఉన్న ఉపాధ్యాయురాలిని ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు అప్పగించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా అదికారులు పట్టించుకోని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. సమస్యల విషయమై ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఇంద్రజను వివరణ కోసం ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.