calender_icon.png 11 October, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనం అందించండి

10-10-2025 12:57:24 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

జడ్చర్ల, అక్టోబర్ 9: విద్యార్థినులకు నా ణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురు వారం జడ్చర్ల మండలంలోని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలంగాణ గిరిజన సం క్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం అన్నం లో కొద్దిగా వడ్ల గింజ మెరికలు ఉండడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బియ్యం ను మంచి కడిగి వండి, విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించాలన్నారు.క ళాశాలలో పుడ్ కమిటీ బోజన నాణ్యత పరిశీలించాలని సూచించారు. విద్యార్థులకు మె నూ ప్రకారం భోజనం అందించ కుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జడ్చర్ల లో ఏర్పాటు చేసిన భవిత కేంద్రం ను తనిఖీ చేశారు.

భవిత కేంద్రం లో పిల్లలకు అందిస్తున్న పిజియో థెరపీ,స్పీచ్ థెరపీ విధానం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టాయిలెట్ పరిశీలించి వెళ్లేందుకు  భవనం నుండి దారి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి మంజుల తదితరులు ఉన్నారు.