calender_icon.png 26 July, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోటలో క్రికెట్ అభివృద్ధికి వెన్నుదన్నుగా ఉంటాం

22-06-2025 05:06:18 PM

డబ్ల్యూడిసిఏ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) సహకారంతో వరంగల్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తామని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(Warangal District Cricket Association) ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగింపు, టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎంతోమంది క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారని, ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయన్నారు. ఈ ప్రాంత క్రీడాకారులను తీర్చిదిద్దుటలో అజయ్ సారధి రెడ్డి సేవలు మరువలేనివన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అపెక్స్ కౌన్సిల్లో కూడా మాట్లాడి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు క్రికెట్ కు మైదానం కోసం స్థలం కేటాయించాలని కోరారు. పట్టుదలతో కృషి చేస్తే ఇక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నెల రోజుల పాటు క్యాంపు నిర్వహించి, క్రీడాకారులను మెలకువలు నేర్పించి తీర్చిదిద్ది ఇటీవల జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్ లో మంచి ప్రతిభ చాటిన క్రీడాకారులకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్స్ లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతి ప్రధానోత్సవం షీల్డ్, మెడల్స్, కోచింగ్ క్యాంప్ లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ మెతుకు కుమార్, సహాయ కోచ్ సంతోష్, మెంబర్ రావుల నవీన్ రెడ్డి, బాస్కెట్బాల్ మాజీ క్రీడాకారుడు ప్రభాకర్, నీలం వెంకటేశ్వర్లు, మురళి, బి.చరిత్ రెడ్డి, బి.ధర్మచరణ్ రెడ్డి, పెరుగు కుమార్, గాదం శ్యాం ప్రసాద్ యాదవ్, వెలుగు శ్రావణ్, ఆబోతు అశోక్, కొండమీది రవి, వికాస్, రమేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.