calender_icon.png 25 July, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం..

23-07-2025 12:57:24 AM

- గోదావరి నదిలో తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదు

- బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్   

బెల్లంపల్లి అర్బన్, జూలై 22 : చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని టిఆర్‌ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బనకచర్ల ద్రోహాన్ని బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలంగాణకు జరిగే అన్యాయoపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టే పోలవరం - బనకచర్ల లింకు ప్రాజెక్టు అని, పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు అడుగులకు మడుగు లు ఒత్తుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర నీటి నీ ఆంధ్రకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి చీక టి ఒప్పందాలకి చరమగీతం పాడాలన్నారు. ఇంత వరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదనీ, విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల విద్య భరోసా కార్డులు లేవని, విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం మోసం చేశారని విమర్శించారు. 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పది పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్మీడియట్ పాస్ అయితే రూ.15 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.25 వేలు, పీజీ పాస్ అయితే రూ. లక్ష, ఎంఫీల్, పిహెచ్డి పూర్తిచేస్తే రూ. 5 లక్షలు ఇస్తామని  రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విద్యార్థులను మోసగించిందన్నారు. తక్షణమే గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో బిఆర్‌ఎస్ పార్టీ లక్షల మంది విద్యా ర్థులతో  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్వీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు అడెపు అరుణ్, కార్యదర్శి సుమంత్, సీనియర్ నాయకులు మురుకురి శ్రావణ్, దార రోషన్, అజయ్, విష్ణు, సాయి కిరణ్, సంతో ష్  కార్యకర్తలు పాల్గొన్నారు.