calender_icon.png 24 July, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూములు మాకు ఇవ్వాల్సిందే..

23-07-2025 12:58:10 AM

తుర్కయంజాల్, జులై 22:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలోని సర్వేనెంబర్ 488లో తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు తమకే దక్కాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. కొందరు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నకిలీ కాగితాలు సృ ష్టించి తమ భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. మంగళవారం సర్వే నెంబర్ 488లోని భూమిలో పట్టాదారులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శీలం తులసయ్య అనే వ్యక్తిపై ఉన్న 2.1 ఎకరాల భూమిలో 1.14 గుంటల భూమిని గతంలో తమ కుటుంబీకులు అమ్ముకున్నారని, మిగతా 27గుంటల భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనికి నకిలీ పత్రాలు సృష్టించి దాసర్లపల్లి దర్శన్రెడ్డి అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చదువురాని తమ పెద్దల నుంచి తెల్ల కాగితంపై సంతకాలు తీసుకొని భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థపైకి మార్చారని ఆరోపించారు. తాము కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో దగ్గర ఫిర్యాదులు చేస్తే, దిగివచ్చి సెటిల్మెంట్లకు వచ్చారని గు ర్తు చేశారు. కాగా, కొన్నాళ్లుగా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిపై మేం కబ్జాకు వెళ్తే పోలీసులతో కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు.

దర్శన్రెడ్డి, సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చిన హామీ మేరకు మా భూములు మాకు ఇప్పించాల్సిందేనని వారు పట్టుబట్టారు. ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేశామని, అవసరమైతే జాతీయ ఎస్సీ క మిషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగద ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శీలం తులసయ్య, శీలం జంగయ్య, శీలం యాద య్య, శీలం నర్సింహ, శీలం రంగయ్య, శీలం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.