23-07-2025 12:56:22 AM
వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభం
ఎల్బీనగర్, జులై 22 : కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఇటీవల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ట్యాంక్ నుంచి ఆలయ ప్రాంగణంలో తాగునీటిని సరఫరా చేయడానికి చేపట్టిన పైప్ లైన్ పనులను మంగళవారం ప్రారంభించారు.
ఆలయంలో పూర్తి చేసిన 1.20 లక్షల లీటర్ల కెపాసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నుంచి దేవస్థానంలో వివిధ ప్రాం తాలకు నీటి సరఫరా కోసం దాత అంకంగారి సోమలింగం గౌడ్ ఆర్థికసాయంతో పైపు లైన్ ప నులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో దాత కర్మణ్ ఘాట్ నివాసి అంకంగారి సోమలిం గం గౌడ్ దంపతులు, ఆలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు ప్రవీణ్ గౌడ్, కిరణ్ కు మార్, శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె.కవిత, నరేశ్, సంతోష్ కు మార్, రవీందర్ రెడ్డి, ఎక్స్ అఫీషియో మెంబరు అంబా ప్రసాద్ పాల్గొన్నారు.
స్వామివారిని ద ర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనరు వెంకట్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు, అర్చకులు సాంప్రదీయ రీతిలో స్వాగం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వదాము, తీర్థ ప్రసాదాలు, స్వామి వారి జ్ఞాపికనుఅందజేశారు.