calender_icon.png 10 January, 2026 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తాం!

06-01-2026 12:00:00 AM

  1. హెటిరో కాలుష్యంపై తేల్చాల్సిందే
  2. దోమడుగు గ్రామస్థుల హెచ్చరిక

గుమ్మడిదల, డిసెంబర్ 5: గత పన్నెండేళ్లుగా తమ గ్రామాన్ని పట్టిపీడిస్తున్నహెటిరో పారిశ్రామిక కాలుష్య సమస్యపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడు గు గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దోమడుగులో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (కెవిపిసి) కన్వీనర్లు మద్ది బాల్‌రెడ్డి, మంగయ్యల అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు రాబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించారు. 2012లో కాలుష్యం నిరూపితమై నా నేటికీ నల్లకుంట చెరువు గులాబీ రంగులోనే ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జోక్యం చేసుకున్నా, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హెటెరో డ్రగ్స్ యూనిట్-1, ఇతర కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలన్నారు. 2025 లో సేకరించిన నీటి నమూనాల ల్యాబ్ రిపోర్టులను వెంటనే బహిరంగపరచాలని, కాలుష్య బాధితులకు తక్షణమే వైద్య సదుపాయాలు, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులకు 2012 నుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం లెక్కగట్టి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిజెఏసి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వై.అశోక్ కుమార్ హాజరై మద్దతు ప్రకటించారు. సమావేశంలో కోకన్వీనర్ జయమ్మ పాల్గొన్నారు.