10-01-2026 07:40:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను బిజెపి కైవసం చేసుకుంటుందని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో బూతు స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలి.
ప్రతి బూత్‌ను కార్యకర్తల ఆధారంగా బలమైన, క్రమబద్ధమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో నిరంతరంగా మమేకమై, పార్టీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి గారు సూచించారు. ప్రజలతో నిత్య సంబంధం, ప్రతి ఇంటికి పార్టీ విధానాలు చేరేలా వ్యవస్థీకృత పని విధానం, బూత్ స్థాయిలో బాధ్యతాయుత నాయకత్వం ఎలా నిర్మించాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు.