calender_icon.png 11 January, 2026 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

10-01-2026 07:28:08 PM

నిర్మల్,(విజయ క్రాంతి): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జి పటేల్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించాలని ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు పోతున్నామన్నారు. నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి నిర్మల్ అభివృద్ధిని విస్మరించి హైదరాబాదులో ఉంటూ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నందున ఆ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నిర్మల్ ప్రజలకు బిజెపి వల్ల ఒరిగింది ఏమి లేదని రెండు సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకు రాలేదని ధ్వజమెత్తారు దీన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీహరి రావు అర్జుమంత్ అలీ భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది నాందేడ్ చిన్ను అప్పల గణేష్ చక్రవర్తి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు