calender_icon.png 11 January, 2026 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేస్ బాలికల కాలేజీలో సంక్రాంతి సంబరాలు

10-01-2026 07:24:58 PM

రేస్ విద్యా సంస్థ చైర్మన్ బాణాల వసంత రెడ్డి వెంకట్ రెడ్డి

కోదాడ: కోదాడ పట్టణం నయా నగర్ లో రేస్ బాలికల కాలేజీలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా ప్రారంభమైనవి! విద్యార్థినులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు వేసిన రంగురంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బాణాల వసంత మాట్లాడుతూ... పల్లె సంస్కృతి,  సాంప్రదాయాలు నేటి తరం విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో కళాశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ముందస్తుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పండగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థినులకు నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.