10-01-2026 07:30:38 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు వివిధ రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ చేతుల మీదుగా భోగిమంటల తో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా భోగిమంటల చుట్టూ విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడపడం జరిగింది .ఈ సందర్భంగా రేకులపల్లి సుష్మ మాట్లాడుతూ మనం రైతులను గౌరవించుకోవాలని తెలపడం జరిగింది, అదేవిధంగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం మా కళాశాలలో విద్యార్థులకు సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని తెలుపుతూ తల్లిదండ్రులకు విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలపడం జరిగింది . ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.