calender_icon.png 10 January, 2026 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి

06-01-2026 12:00:00 AM

మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు 

మహబూబాబాద్/ జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కలెక్టర్లు అద్వైత్ కుమార్ సిం గ్, రాహుల్ శర్మ అన్నారు. ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజల నుండి ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, దరఖాస్తులను వీలైనంత తొందరలో పరిష్కరించి ప్రజలకు జవాబుదారితనంగా అధికారులు పనిచేయాలని సూచించారు.