06-01-2026 12:00:00 AM
కేసముద్రం, జనవరి 5 (విజయక్రాంతి): కేసముద్రం స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. 1999లో కానిస్టేబుల్ గా కన్నాయి గూడెం పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరిన ఇమామ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొడకండ్ల ములుగు కాజీపేట మహ బూబాబాద్ పోలీస్ స్టేషన్లలో విధు లు నిర్వహించి అనంతరం హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది మద్దూరులో పని చేశారు. ఏఎస్‌ఐ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ విభాగంలో చేరారు.
2025 డిసెంబర్ నెలలో ఎస్‌ఐగా పదోన్నతి పొం దిన ఆయన కేసముద్రం స్పెషల్ బ్రాంచ్ ఎస్త్స్రగా ఇంతకాలం విధులు నిర్వహిస్తూ, సివిల్ ఎస్‌ఐగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యా రు. ఎస్పీ డాక్టర్ శబరీష్‌ను ఎస్‌ఐ ఇమామ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ ఎస్‌ఐగా పదోన్నతి పొందిన ఇమా మ్‌ను ఎస్పీ అభినందించారు.