calender_icon.png 11 January, 2026 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి వివేకానంద యువతకు ఆదర్శం

10-01-2026 07:21:21 PM

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్,(విజయక్రాంతి): స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో జనవరి 12న నిర్వహించే వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకని, యువత తెలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, స్వామి వివేకానంద ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి జిల్లా యువసేవ పురస్కార్ అవార్డు కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్, తెలంగాణ యువజన సమితి జిల్లా కన్వీనర్ వొడ్నాల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు జక్కని సాయిరాం, పటేల్ సుధీర్ రెడ్డి, గంగాధర చందు, బొంకూరి మోహన్, అన్వేష్, మహేందర్,  సుస్మిత, కిరణ్ మయి, తదితరులు పాల్గొన్నారు.