10-01-2026 08:08:07 PM
ప్రపంచ వేదికపై ప్రతిభ చూపేందుకు సన్నద్ధమైన చిన్నారులు
ఆర్థిక సహాయం అందించిన మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్
మేడిపల్లి,(విజయక్రాంతి): చెంగిచెర్ల క్రాంతి కాలనీ చెందిన ఇప్పకాయల రాములు, సంధ్య దంపతుల కుమారులైన ఇప్పకాయల విశ్వంక్ తేజ్, (ఐదవ తరగతి), ఇప్పకాయలు విశాల్ తేజ్ (ఏడవ తరగతి) బాలస్కేటర్లు, నేపాల్ లో జరగనున్న, అంతర్జాతీయ స్థాయి, స్కేటింగ్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని, మేడ్చల్ కాంగ్రెస్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ప్రోత్సాహకంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ బాలలు కోచ్ సయ్యద్ ముక్తార్ ఆధ్వర్యంలో, శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటికే వీరికి మూడు జాతీయ పతాకాలతో పాటు, రాష్ట్ర, జిల్లా, స్థాయిల్లో అనేక పథకాలు లభించాయి. జాతీయ స్కేటింగ్ రోలర్ ఛాంపియన్షిప్, రోల్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర, జిల్లా స్కేటింగ్ సంఘాల ఆధ్వర్యంలో, నిర్వహించిన పోటీల్లో పాల్గొని పథకాలు సాధించి విశేషంగా నిలిచారు.
ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు నేపాల్ లో జరగనున్న అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో భారత్ తో పాటు, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పాకిస్తాన్, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ప్రపంచ స్థాయి పథకం సాధించాలని లక్ష్యంతో ఈ బాలలు కఠినంగా శిక్షణ పొందుతున్నారు. బొల్లిగూడెం బోడుప్పల్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ అక్బర్, రిటైర్డ్ ప్రిన్సిపల్ దాసరం బాలయ్య, బాలలను అభినందించారు. ఇండియాకు, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
క్రాంతి కాలనీవాసులు, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, లక్ష్మణ్ నాయక్, ఈదుల రాజు గౌడ్, ఎమ్మి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, డాన్ యుగంధర్, గోల్డ్ రాజు, బుల్లెట్ రమేషు, పోలీస్ రాజిరెడ్డి, నారాయణరావు, శ్రీరామ్ నాయక్, తదితరులు బాలలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ బాలలకు ప్రోత్సాహం లభిస్తే ఈ బాలలు, తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికపై, విశ్వ విజేతలుగా నిలుస్తారని, తల్లిదండ్రులు, స్థానికులు, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.