10-01-2026 07:33:57 PM
సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో డైరెక్ట్ ప్లానింగ్ & ప్రాజెక్ట్స్ కె.వెంకటేశ్వర్లు పర్యటించారు. కొత్తగూడెం నుంచీ వచ్చిన ఆయన శనివారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ తో కలిసి KKOC లో జరుగుతున్న రైల్వేసైడింగ్ పనీ స్థలాలను పరిశీలించారు.
రైల్వే సైడింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డైరెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేసినప్పుడే లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువవుతుందని అన్నారు.