10-01-2026 07:17:59 PM
ఉపాధి హామీ నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
డిసిసి అధ్యక్షులు వేడుమ బొజ్జు పటేల్
నిర్మల్,(విజయక్రాంతి): దేశంలో పేదలకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు పటేల్ ధ్వజమెత్తారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరు తొలగించి రాంజీ పేరు ప్రతిబింబించేలా ఉపాధి హామీ పథకాన్ని మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం పై మోడీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చి సంపన్నులకు కొమ్ము కాసే విధంగా వివరిస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్చడానికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని ఈనెల 20 నుంచి నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
గ్రామ సభలో తీర్మానం చేసి ఉపాధి హామీ కూలీలకు పని భద్రత కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. దేశంలో మోడీ పాలన ప్రజలకు ఏమీ పెరిగింది లేదని దేశ సంపదను కొందరు బడా వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పడుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండి పోరాడవలసి ఉంటుందని తెలిపారు.