15-09-2025 12:36:15 AM
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్14)విజయక్రాంతి): బీసీల బావాజాలాన్ని గ్రామ గ్రామాన గడపగడపకు తీసుకువెళ్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులుఅన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవిలు హాజరై మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో బీసీ రాజ్యాధికార సభ ముఖ్యదేశం గత 75 సంవత్సరాలుగా బీసీలు ఎంతో నష్టపోతున్నారని ఇకనైనా మేల్కొని బీసీలు నష్టపోకుండా వారి హక్కులను సాధించే దిశగా పో రాటం చేయాలని పిలుపు నిచ్చారు.
చైతన్యంతో పోరాడావలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఇప్పటికే బీసీలలో చైతన్యం నింపడం కోసం వివిధ పుస్తకాలు ఆర్టికల్స్ ను రాసినట్టు గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామ గ్రామాన గడపగడపన బీసీ బావాజాలాన్ని తీసుకువెళ్లినట్టు తెలిపారు. గ తంలో హైదరాబాదులో తాజ్ కృష్ణ హోటల్లో బీసీలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని.. ప్రభుత్వానికి కులగనున చేయాల్సిందిగా డిమాండ్ చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి కులగలను చేసిందని అన్నారు.
అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించుకునేందుకు పోరాటం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో పొందుపరచాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి మేధావుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉరుమల్ల విశ్వం,ఎమ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థిప్రసన్న హరికృష్ణ, బీసీ నాయకులు సబ్బని వెంకట్, కరీంనగర్ జిల్లా బిసిఐఎఫ్ నాయకులు సాంబయ్య బిసి మేధావులుపాల్గొన్నారు.