15-09-2025 12:35:40 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో రైతుల కు యూరియా పంపిణీ ప్రక్రియ పై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. నియో జకవర్గ పరిధిలోని మండలాల్లో రైతు వేదికల వద్ద యూరియా పం పిణీ టోకెన్లను అధికారుల ఆదేశానుసారం రైతు భరోసా రికార్డు ఆధా రంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇప్పటివరకు పం పిణీ చేసిన యూరియా వివరాలను, ఇంకా ఈ సీజన్ పూర్తి వరకు ఎంత యూరియా అవసరం ఉందని అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా యూరియా తెప్పించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారని అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో ఏడిఏ శ్రీనివా స్ రావు, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.