04-05-2025 08:05:01 PM
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..
కోదాడ: కారుణ్య నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆదివారం కోదాడ శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) తో కలిసి ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన 22 మందికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కోదాడలో 100 పడకల ఆస్పత్రి పనులను పరిశీలించారు, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం, సూపరిండెంటెండ్ దశరధ నాయక్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.