04-05-2025 08:13:16 PM
38 మంది అభ్యర్థుల గైర్హాజరు..
పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ...
అదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,659 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వారికోసం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 7 కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah), ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan)లు సందర్శించారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ విధానాన్ని, సీసీ కెమెరాలను పరిశీలించి, ఆన్ని పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, మెడికల్ క్యాంప్, విద్యుత్ సౌకర్యం ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1659 మంది దరఖాస్తు చేసుకోగా, 1621 మంది అభ్యర్థులు హాజరుకగా, 38 మంది గైర్హాజరయ్యారు.