04-05-2025 07:59:34 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన వడ్డెర ఓబన్న విగ్రహానికి దాతగా ఒక లక్ష రూపాయలు విరాళాలు అందజేసినందుకు ఆదివారం పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాత వేముల వెంకయ్య మాట్లాడుతూ... తమ కులానికి పేరు తెచ్చిన గొప్ప నాయకుడని ఆయన ఆశయ సాధన కోసం కోదాడ పట్టణంలో విగ్రహం ఏర్పాటుకు నా వంతు కృషి చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.