04-09-2025 12:31:07 AM
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి
కల్వకుర్తి, సెప్టెంబర్ 3 : ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం హామీలను అమలు చేసేంతవరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాబిదేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి నూతన పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను, వితంతులను, వికలాంగులను, మహిళలను, నిలువునా మోసం చేశాడన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ఇవాళ తెలంగాణ ప్రజలను హరిగోశలు పెడుతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ విడతల వారీగా ఉద్యమిస్తా మన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ వివేకానంద, సీనియర్ నాయకులు రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, రవిగౌడ్, గంగాధర్, అభిలాష్ రెడ్డి, నరేష్ చారి, శివకుమార్, శేఖర్ రెడ్డి, కాళిదాసు , పట్టణ ఉపాధ్యక్షులు అభిగౌడ్, శ్రీధర్ తదితరులుపాల్గొన్నారు.