calender_icon.png 5 September, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, సీపీఎం నేతల ముందస్తు అరెస్ట్

04-09-2025 12:31:12 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబరు 3,(విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, బీజేపీ, సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బి జె పి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లును, సి పీ ఎం నేతలు అన్నవరపు సత్యనాయన ,సత్య లను పాల్వంచ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా అదు పులోకి తీసుకున్నారు.

అనంతరంప వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్ర ధాన ప్రతిపక్షం బీ.ఆర్.ఎస్ అయిన - ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ జిల్లాలో బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులెవరినీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయలేదు. దీని ద్వారా కాంగ్రెస్ బీ.ఆర్.ఎస్ పార్టీలు ఒకటే అన్నది స్పష్టమవుతోంది. ప్రజల పక్షాన నిజంగా పోరాడేది కేవలం బీజేపీ, సి పీ ఎం పార్టీలు మాత్రమే. అందుకే ఈ ప్రభుత్వం భయపడి, ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా ముందుగా బీజేపీ, సీ పీ ఎం నాయకులనే అరెస్ట్ చేస్తోంది అని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ బీ.ఆర్.ఎస్ ఒకటే. ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ మూడు మంత్రిత్వ పదవులు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి మాత్రం పూర్తిగా విఫలమైంది. అనేక సమస్యలు పరిష్కారం కాలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారు అని తెలిపారు.