04-09-2025 12:29:57 AM
కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి సంయుక్త కిసాన్ మోర్ఛా
భద్రాద్రి కొత్తగూడెం నంబర్ 3 (విజయక్రాంతి) కేంద్ర ప్రభుత్వం ముడిపత్తి దిగుమతులపై 11% సుంకాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారంపాల్వంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించ్చారు.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, తులసిరామ్, కె కిషోర్ లు మాట్లాడుతూ... నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బడా గుత్త పెట్టబడి దారులకు, విదేశీ పాలకవర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దేశంలోని పత్తి రేటు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.
ఈ 11 సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతదేశంలో సగటున రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.గత ప్రభుత్వాల కంటే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని. వ్యవసాయ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతాంగానికి సరిపడా యూరియా బస్తాలను దిగుమతి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పత్తికి సీ2 ప్లస్ 50 శాతం కలిపి క్వింటాకు రూ 10,075 మద్దతు ధర ఇవ్వాలని.
ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, దిగుమతి సుంకాల పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని.రైతులందరికీ సరిపడా యూరియా బస్తాలను వెంటనే దిగుమతి చేసి రైతులకు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల అనుబంధ రైతు,కార్మిక సంఘాల నాయకులు. శనిగరపు శ్రీనివాసరావు, నిమ్మల రాంబాబు, సత్యవాణి, రాయబారపు వెంకటేశ్వర్లు, జి రమేష్, మంకేన వెంకటేశ్వర్లు, కొంగర అప్పారావు, బాణోత్ రంజిత్, డి చెన్నయ్య, ఎస్కే కరీం తదితరులు పాల్గొన్నారు.