20-05-2025 12:26:10 AM
‘అందాల పోటీలు ‘ వ్యాపార సంస్కృతి అంశం పై సదస్సు
సిద్దిపేట, మే 19 (విజయక్రాంతి): మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22 న హైదరాబాద్ లో ‘అందాల పోటీలు - వ్యాపార సంస్కృతి‘ అనే అంశం పై సామాజిక సదస్సు నిర్వహిస్తున్నట్టు మంజీరా రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు కె. రంగాచార్య, ప్రధాన కార్యదర్శి కవి, డాక్టర్ సిద్దెంకి యాదగిరిలు తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ సదస్సులో ప్రముఖ కవయిత్రి విమల ప్రధాన వక్త గా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. సభలో ఆత్మీయ అతిధిగా ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య ఆకాడమీ మాజీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి లు హాజరవుతారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపారు. అందాల పోటీలు సమాజానికి ఈరకంగా ఉపయోగ పడేవి కావని వారు తెలిపారు.
మహిళల్ని వ్యాపార వస్తువుగా చేయడం కోసం మాత్రమే అందాల పోటీలన్నారు. అందాల పోటీలకు తాము వ్యతిరేకమని చెప్పారు. హైదరాబాద్ లో జరిగే మరసం సదస్సుకు సిద్దిపేట జిల్లా నుండి, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు, కవి, డాక్టర్ పొన్నాల బాలయ్య, మరసం , ప్రముఖ కవి అలాజ్ పూర్ కిషన్, తెలంగాణ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు తోట అశోక్, నందిని భగవాన్ రెడ్డిలు పాల్గొన్నారు.