calender_icon.png 23 May, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలక్‌పేట్‌లో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం

23-05-2025 12:00:00 AM

ఇంచార్జ్ షేక్ అక్బర్

మలక్‌పేట్, మే 22 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు అందరిని సమన్వయం చేసుకొని ఐకమత్యంతో కలిసి పని చేస్తామని మలక్పేట్ నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ అక్బర్ అన్నారు.  రానున్న ఎన్నికలలో మలక్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని  పేర్కొన్నారు.  మలక్ పేట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని చంచల్ గూడ లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలక్ పేట్ నియోజకవర్గంలో  కార్యకర్తలను బలోపేతం చేస్తే పార్టీ పట్టిష్టమవుతుందని తెలి పారు. మలక్ పేట్ నియోజకవర్గంలో  డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అద్యక్షులను గుర్తించి త్వరలో నియమిస్తామని పేర్కొన్నారు. మల క్‌పేట్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలను పార్టీ పరిశీలకులు అధిష్టానానికి నివేదించాలని కోరారు. 

కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ  కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గురించి  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని తెలిపారు. కాంగ్రెస్ పరిశీలకులు సుబ్రహ్మ ణ్యం, సురేష్‌లు మాట్లాడు తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ప్రతి జిల్లాలో కాంగ్రెస్ట్‌ని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయా లని కోరారు. పార్టీ కోసం శ్రమించే నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పు డూ తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బోల్లు కిషన్, నాయకులు సురేందర్ రెడ్డి, బాబు శ్రీనివాస్, సోహెల్, అశ్వాక్, మదన్ బాబు తదితరులు పాల్గొన్నారు.