17-10-2025 03:02:45 PM
పెట్రోల్ తో రైతులు ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం(Tirumalagiri Mandal) తొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సుమారు 200 కోట్లతో నిర్మాణం తలపెట్టిన పాఠశాలకు శంకుస్థాపన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొనగా, ఉద్రిక్త నెలకొంది. తమ భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ భాగిత రైతులు భూమి పూజ కార్యక్రమం వద్దకు వచ్చి, పోలీస్ వాహనాలకు ఎదురు వెళ్లి, నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ భూములు లాక్కుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని పలువు రైతులు ఆందోళనకు దిగారు. జరిగిన సంఘటనపై రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు