12-01-2026 02:46:28 AM
రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్
నేడు యూసుఫ్‌గూడమెగా డ్రైవ్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం
రాష్ట్రాన్ని రోడ్డు భద్రతలో ఆదర్శంగా నిలుపుతాం: డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాద రహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మక కార్యాచరణకు సిద్ధమయ్యాయి. నిత్యం పదుల సంఖ్యలో జరుగు తున్న ప్రమాదాలు, అమాయకుల ప్రాణనష్టానికి అడ్డుకట్ట వేసేందుకు అరైవ్ అలైవ్ పేరుతో బృహత్తర రోడ్డు భద్రతా ఉద్యమాన్ని పోలీస్ శాఖ చేపట్టింది. ఈ కార్యక్ర మాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం యూసుఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ బి శివధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. సంక్రాంతి సెలవు లను మినహాయించి, జనవరి 13 నుంచి 24 వరకు మొత్తం పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు.
‘సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి క్షేత్రస్థాయి కానిస్టేబుల్ వరకు అందరూ రోడ్లపైకి వచ్చి ప్రజల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తారు. కేవలం జరిమానాలు విధించడమే కాకుండా, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం’ అఅని డీజీపీ స్పష్టం చేశారు. ఈ పది రోజుల్లో పోలీసులు ప్రధానంగా ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపనున్నారు. వాహనం నడిపే వారే కాదు, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారులో ముందు సీట్లే కాకుండా, వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా బెల్ట్ పెట్టుకోవాలి. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, సిగ్నల్ జంపింగ్, హైబీమ్ లైట్ల వినియోగం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తారు.
గ్రామస్థాయిలో కమిటీలు
ఈ కార్యక్రమం నగరాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా విస్తరించనుంది. గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ ట్రాఫి క్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. మం డల స్థాయిలో సీఐలు, డివిజన్ స్థాయిలో డీఎస్పీలు, జిల్లా స్థాయిలో ఎస్పీ, కమిషనర్లు ఇతర అధికారులతో సమన్వయం చేసుకుం టూ ఈ డ్రైవ్‌ను పర్యవేక్షిస్తారు. విద్యార్థులు, యువత, ఆటో డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నారు. రోడ్డు భద్రత విష యంలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరిం చాలని డీజీపీ శివధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.