06-12-2025 12:00:00 AM
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఐదేళ్లకోసారి వచ్చే గంగా భవాని దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, గంగాభవాని దయతో అందరికీ శుభం కలగాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే దాన్ని హరీష్ రావు కోరారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన గంగాభవాని వార్షికోత్సవంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. గంగా భవాని దేవాలయం దాని పక్కన ఫంక్షన్ హల్ అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు.
సిద్దిపేట కోమటి చెరువుతో పాటు అన్ని చెరువులను అద్భుతంగా చేసుకున్నామన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో ఉచిత చేప పిల్లలు ఇచ్చామని, సిద్దిపేట చేపలు కలకత్తా వరకు వెళ్ళాయని చెప్పారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రం లోనే ఆదర్శం గా నిర్మించుకున్నామని, ఈ ఫిష్ మార్కెట్ ను ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి వచ్చి చూసి నేర్చుకున్నారని అంత అద్భుతంగా నిర్మనించుకున్నామని తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బంగారం లాంటి చేపల పంట పండిందని గంగా పుత్రులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారనీ చెప్పారు.