27-07-2025 01:20:32 AM
కౌశిక్‌రెడ్డి మాటలు జాగ్రత్త: సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి
హైదరాబాద్, జులై 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్(సాట్స్) శివసేనారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతాయని అన్నా రు.
శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి కౌశిక్‌రెడ్డి అనే ఒక పిచ్చి కుక్క దొరికిందన్నారు. కేసీఆర్ ఇంట్లో పడుకుని బయటికి కౌశిక్‌రెడ్డి లాంటి కొన్ని కుక్కలను బయటికి పంపి స్తున్నారన్నారు. నీ లాంటి సన్నాసుల ఫోన్లు ఎవరైనా ట్యాపింగ్ చేస్తారా? నీకే గతి లేదు? మీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకేమి పట్టింది? అని శివసేనారెడ్డి దుయ్యబట్టారు.