25-12-2025 12:00:00 AM
వృద్ధులకు,గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ
ములుగు,తాడ్వాయి,డిసెంబర్24(విజయక్రాంతి):గ్రామస్థులకు స్థానికంగా అడవిలో దొరికే వనరులతో ఉపాధి కల్పిస్తాం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.బుదవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని కన్నేపల్లి గ్రామంలో వృద్ధులకు, గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొని, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దట్టమైన అడవి ప్రాంతమైన కన్నేపల్లి గ్రామంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున దుప్పట్లు, స్వేటర్లు పంపినీ చేయడం జరుగుతుందని గ్రామస్థులకు స్థానికంగా అడవిలో దొరికే వనరులతో ఉపాధి కల్పిస్తామని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి అన్నారు.