25-12-2025 12:00:00 AM
మహాదేవపూర్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మం డల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నాగేంద్రగిరి శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆల యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పా ల్గొన్నారు.ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో స్వామి వారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాం గణంలో భక్తులను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వ ర్షాలు కురిసి రైతాంగానికి సమృద్ధిగా పంటలు పండాలని, రైతులకు అధిక లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు.తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా, ఎరువుల లభ్యత వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
రైతులు నిర్బంధాలు లేకుండా వ్యవసాయం చేసుకునేలా అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.