calender_icon.png 13 September, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆర్. కృష్ణయ్య జన్మదిన సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

13-09-2025 05:34:06 PM

కేక్ కట్ సంబరాలు జరుపుకున్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం బీసీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  జిల్లా అధ్యక్షుడు మేకల పర్షరాములు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ  శ్రీ జోడు ఆంజనేయస్వామి, అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గత 45 సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏకక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అన్నారు.  బీసీ సమాజ అభివృద్ధికి ఆయన చూపిస్తున్న మార్గదర్శకత్వాన్ని కొనియాడారు.