calender_icon.png 13 September, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో అంతర్గత రోడ్లతో రవాణా సౌకర్యం మెరుగు

13-09-2025 05:31:46 PM

- గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తా..

- చిట్యాల మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్ ..

- సుమారు రూ.903 లక్షల వ్యయంతో గ్రావెల్, బీటీ రోడ్లు, నాపాక దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

చిట్యాల(విజయక్రాంతి): భూపాలపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో రవాణా సౌకర్యాలను బలోపేతం చేసేందుకు అంతర్గత రహదారుల పనులు వేగవంతం చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సుమారు రూ.903 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు,బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

ముందుగా ఒడితల గ్రామంలో ఒడితల నుండి మొరంచవాగు వరకు రూ.50 లక్షలు, ఆర్ అండ్ బీ రోడ్డు ఒడితల నుండి బద్దిపోచమ్మ ఆలయం వరకు రూ.50 లక్షలతో రోడ్డు,జడల్ పేట నుండి పాశిగడ్డతండా వరకు రూ.162 లక్షల రోడ్డు, రామచంద్రాపూర్ గ్రామం నుండి శాంతినగర్ వరకు రూ.30 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు, పంచాయతీ రాజ్ రోడ్డు గుంటూరుపల్లి నుండి చిట్యాల రోడ్డు వరకు రూ.144 లక్షలు రోడ్డు,చింతకుంటరామయ్యపల్లి గ్రామం నుండి శాంతినగర్ వరకు రూ.100 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే నాపాక దేవాలయం నుండి మామిడితోట వరకు రూ.40 లక్షలు, ఎస్సీ కాలనీ నుండి మొరంచ బ్రిడ్జి వరకు రూ.20 లక్షలు, చెంచుకాలనీ నుండి పాశిగడ్డ తండా వరకు రూ.207 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు, నాపాక సర్వతోభద్ర ఆలయంలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. అనంతరం రూ.100 లక్షలతో ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.