calender_icon.png 13 September, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

13-09-2025 05:36:43 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మండలంలోని చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు వర్చుసా ఫౌండేషన్(Virtusa Foundation) హైదరాబాద్ వారు స్కూల్ బ్యాగులు శనివారం పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనుకుంట్ల నవీన్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు టి రంజిత్ వర్చుసా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను సోషల్ మీడియా వీక్షించి రంజిత్  పనిచేస్తున్న వర్చుసా కంపెనీ ద్వారా  62 మంది విద్యార్థులకు 50 వేల రూపాయలు విలువ చేసే స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె నవీన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి  దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ మునుగోటి ఎస్తేరా, కంపెనీ ప్రతినిధులు ఫణి, ఉపాధ్యాయులు కందగట్ల బాలాజీ,  వేదాంతం ఆదిత్య, వెల్మకంటి శ్రీహరి, టి  వీరస్వామి, రమణశ్రీ వర్చుసా ఫౌండేషన్ ప్రతినిధులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.