16-07-2025 12:00:00 AM
రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతుల ప్రెస్ మీట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝూ
రామగుండం జులై 15 (విజయక్రాంతి)లొంగిపోయిన ప్రతి మావోయిస్టు కు తె లంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం అందచేస్తామని రామగుండం పోలీ స్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ తెలిపా రు.నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ కి చెం దిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు కమిషనరేటు పోలీసుల ఎదుట మంగళవా రం సాయంత్రం లొంగిపోయారు. తెలంగా ణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహాకారాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయారని అ లాగే లొంగిపోయిన మాజీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, తా ము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్ర శాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని, కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ముందు లొంగిపోయారని సిపి అంబర్ కి షోర్ జూ తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సిపి మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు దంపతుల గురించి పూర్తి వివరాలు వెల్లడించారు.
తెలంగాణ కు చెందిన ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అలియా స్ రాజప్ప, (65) పారపెల్లి గ్రామం, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లాకు చెందినవాడని, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్ సీఎం /ఇం చార్జీ డివిజన్ టెక్నికల్ టీం,నార్త్ బస్తర్ డివిసి, ఛత్తీస్గఢ్ 1983 సంవత్సరం లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ లో దళ సభ్యుని చేరి చెన్నూర్ దళం లో పనిచేశాడని, 1988 సం వత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడని, 1989 సంవత్సరంలో చౌదరిఆంకుభాయి అలియాస్ అని తక్క ని వివాహం చేసుకున్నాడని, ఆ తరువాత పార్టీ అతడిని 1995 వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారని, 2002 సంవత్సరంలో డీసీఎం గా పదో న్నతి పొంది తిరిగి డీకే ఎస్ జెడ్ సి లోని టెక్నికల్ డిపార్ట్ మెంట్ కి బదిలీ అయ్యాడని, 2007 సంవత్సరంలో పార్టీ అతడిని నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్ మెంట్ కి ఇంచార్జ్ గా నియమించిందని, 2023 సంవత్సరంలో ఇతనికి డీకే ఎస్ జెడ్ సి ఎం గా ప దోన్నతి లభించింది. లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడని, ఆత్రం లచ్చన్న పై తెలంగాణ లోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదు చేయబడ్డాయని,
చౌదరి ఆంకుభాయి @ అనితక్క @ లక్ష్మి,భర్త ఆత్రం లచ్చన్న @ గోపన్న, 55 సం:లు, ఆగరగుడా గ్రామం, బెజ్జూర్ మం డలం, కొమరంభీంఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.డీసీఎం, డివిజన్ టెక్నికల్ టీం,నార్త్ బస్తర్ డివిసి,ఛత్తీస్గఢ్.అనితక్క 1988 వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో సిపిఐ ఎం.ఎల్ పి డబ్ల్యు లో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్ ద ళం లో పనిచేసింది.అలా సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ క మాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది.1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995 లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయిందని, 2002 సంవత్సరంలో ఎస్ సిఎం గా పదోన్నతి పొంది తిరిగి డీకే ఎస్ జెడ్ సి లోని టెక్నికల్ డిపార్ట్ మెంట్ కి తన భర్త తోపాటుగా బదిలీ అయ్యిందని, 2007 సంవ త్సరంలో అనితక్క నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్ మెంట్ కి బదిలీ అయ్యిందని, లొంగిపోయేంతవరకు నార్త్ బస్తర్ డివిసి లోని టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో డీసీఎం గా పనిచేస్తుందని, చౌదరి ఆంకుభాయి పై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదు చేయబడ్డాయనితెలిపారు.
మీ ఊరికి రండి!మావోయిస్టులకు పోలీస్ వారి ఆహ్వానం!!
రామగుండం కమిషనరేట్ పోలీసు శాఖ తరుపున అజ్ఞాతం లో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావల సిందిగా సిపి కోరారు.తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తె లంగాణ అభివృద్దికితోడ్పడాలని అన్నారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్ల యితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు ఇతర సహాయ సహకారా లు అందిస్తుందని, వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుందన్నారు. లొం గిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావా సం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేట్ పోలీ సు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ప్రజా సంఘాల ముసుగులో దందాలు
కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతి లో వ్యవహరిస్తున్నారని,అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని. వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసు కోబడతాయని అన్నారు. యువత, ప్రజలు ఇటువంటి వారికిదూరంగా ఉండాలని కో రారు. మావోయిస్టులకు నేటి యువత దూ రంప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగావ్యవహరిస్తున్నదిచట్ట వ్యతిరేక కార్యక లాపాలకు దూరంగా ఉంటున్నారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గి పోయిందని. చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదని, కా లం చెల్లిన సిద్ధాంతం మావోయిజం నేటి ప్ర పంచంలో మావోయిజం కాలం చెల్లిన సి ద్ధాంతంగా మిగిలిపోయింద న్నారు. హింస ను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని, ప్రపంచంలోని అనేక దేశాలలో ఈమావోయిజంకనుమరుగైపోయింద్నరు.
పోరు వద్దు!! ఊరు ముద్దు!!
మావోయిస్టులు ఆయుధాలను, అజ్ఞాతాన్నివీడండని జనజీవన స్రవంతిలో కలవం డని సిపి మావోయిస్టులను కోరారు.