calender_icon.png 16 July, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ ఇంట్లోకి ఇలాంటి కూరగాయలు తీసుకుంటారా..?

15-07-2025 11:55:05 PM

నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు 

చిరుత సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి

కోయిలకొండ: క్రమం తప్పకుండా మీ ఇంట్లో కూడా వండుకుంటారని అలాంటి సమయంలో తాజాగాలేని కూరగాయలను తీసుకుంటారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రశ్నించారు. మంగళవారం మహత్మా జ్యోతి బా పూలే తెలంగాణ బి.సి.సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్టోర్ రూం ను,రైస్ స్టోర్ రూం ను, స్టోర్ రూం లో కూరగాయలు పరిశీలించి వాటిలో క్యారెట్, వాడి పోవడం,ఉల్లిపాయ తాజాగా లేక పోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా కూరగాయలతో విద్యార్థులకు  రుచికరమైన ఆహారం అందించాలని, ఆహారం వండే సిబ్బంది పరిశుభ్రంగా ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని సూచించారు.

అక్కడి నుండి  వంట గదిలో విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ బాగా కష్టపడి చదివి తాము అనుకున్న లక్ష్యం సాధించాలని సూచించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. అంతకుముందు పట్టణంలోని వీరన్నపేట ప్రాంతంలో చిరుత పులులు సంచరిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి, డీఎఫ్ఓ సత్యనారాయణ సిబ్బందితో కలిసి ప్రత్యేకంగా అటవీ ప్రాంతంలో సందర్శించారు. ప్రజలకు పనులు సలహాలు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో తాసిల్దార్,గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఉపాద్యాయులు ఉన్నారు.